యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు…
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో 29 మంది కి 36, 90, 032 రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో ప్రవేటు వైద్యశాల లో చికిత్స లు పొందిన వీరు, ఎరిక్షన్ బాబు గారి వద్దకు వెళ్ళి చికిత్స కు సంబంధించిన వివరాలు అందించి సహాయం కోరడంతో ఆయన వీరందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చేసారు. దీంతో లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు గారికి, ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు










