Home South Zone Telangana మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|

మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|

0
10

“ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ”

మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్ పరిధిలోని  హరిజన్‌బస్తీలో మురుగునీటి లైన్ బ్లాకేజీ కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదు అందడంతో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మేనేజర్ రమేష్, పోచయ్య, రాజేందర్, ప్రశాంత్‌తో కలిసి బాధిత ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె, మురుగునీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా పూర్తిస్థాయిలో డీసిల్టింగ్ పనులు చేపట్టి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగునీటి వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మహేష్, అంజయ్య, వెంకటమ్మ, హరి తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

NO COMMENTS