పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత” అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు|

0
3

పని చేయనప్పుడు ఉద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత” అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు.

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ప్రతి విభాగం పనితీరును సమీక్షించి నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, ప్రజల ఫిర్యాదుల సత్వర పరిష్కారం, కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవల మెరుగుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆపరేషన్ క్లీన్ స్వీప్’ విజయవంతం చేసేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, ప్రతి గురువారం ‘మీకోసం’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే పోతురాజు కాలువ అభివృద్ధి, ఆక్రమణల తొలగింపు, ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.