వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు
–రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల స్వీకారణ.
-మహబూబాబాద్ రోటరీక్లబ్ కు అభినందనల వెల్లువ.
మహబూబాబాద్:::రోటరిక్లబ్ ఆఫ్ మహబూబాబాద్ కు ఉత్తమ సేవారత్న అవార్డు లభించింది. హైదరాబాద్ కొంపెల్లి వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవాల్లో మహబూబాబాద్ రోటరిక్లబ్ కు అవార్డుల పంట పండింది. డిస్ట్రిక్ట్ – 3150 లోని రెండు రాష్టాల పరిధిలో వివిధ విభాగల్లో తొమ్మిది అవార్డులు సాధించి జయకేతనం ఎగురవేసింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవాల్లో మహబూబాబాద్ రోటరీక్లబ్ పాల్గొంది. రోటరిక్లబ్ అధ్యక్షులు వేమిశెట్టి కిషోర్ కుమార్, సెక్రెటరీ జంగాల విజయ్ కుమార్, రోటరీ వ్యవస్థాపకులు మాలె నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్ లీడర్ వద్దుల సురేందర్ రెడ్డి, ట్రెజరర్ శంతన్ రామరాజు, సీనియర్ రొటేరియన్లు బిక్కి వెంకటేశ్వర్లు, తొర్నాల నగేష్ కుమార్ లు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 2009లో ప్రారంభమైన మహబూబాబాద్ రోటరీ ప్రస్థానం అంచలంచలుగా ఎదిగిందన్నారు. తాము చేస్తున్న సేవాకార్యక్రమాలకు రెండు తెలుగు రాష్టాల 106క్లబ్బులో మూడో స్థానం దక్కడం సమాజం పట్ల మాకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందాన్నారు. 1905 చికాగో నగరంలో పాల్ హ్యారీస్ నాయకత్వాన మొదలైన రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందుకనుగుణంగానే మహబూబాబాద్ రోటరిక్లబ్ పర్యావరణం, విద్య, వైద్య రంగాల్లోనే కాకుండా మహిళాసాధికారికత అంశాలపై స్ఫూర్తిదయాక సేవాకార్యక్రమాలు చేసిందన్నారు. వాటర్ ప్లాంట్లు, విద్యార్థినులకు పదిలక్షల విలువ చేసే రీయుసాబుల్ సానిటరీ ప్యాడ్స్, ఉచితంగా సైకిల్లు, టీవీలు, కృత్రిమకాళ్ళ క్యాంపులు ఇలా కోట్ల రూపాయల విలువ చేసే కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇప్పుడు వచ్చిన అవార్డులు సమాజాభివృద్ధి పట్ల మా భాద్యతను మరింత పెంచాయాన్నారు. ఇదే స్ఫూర్తిగా 2026 – 2027కు గాను మరింత పారదర్శకమైన, నాణ్యమైన, అత్యుత్తమమైన సేవలతో మహబూబాబాద్ రోటరిక్లబ్ ను మొదటి స్థానంలో నిలబెడుతామని విశ్వాసం వ్యక్తంచేశారు.
అదేవిదంగా ఉత్తమ సేవారత్న అవార్డులు సాధించిన మహబూబాబాద్ రోటరీక్లబ్ ను అభినందించిందిన వారిలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ చీఫ్ విప్ తేజవత్ రాంచంద్రు నాయక్, కురవి వీరభద్రస్వామి ఆలయ చెర్మన్ కొర్ణు రవీందర్ రెడ్డిలు వున్నారు. ఈకార్యక్రమంలో రొటేరియన్లు బోనగిరి గిరిధర్ గుప్తా, బొల్లం శ్రీనివాస్, ముల్లంగి మోహన్ రెడ్డి, గూడూరు నాగేశ్వరరావు, కళ్లెం వెంకట్ రెడ్డి, కొడారి నాగేందర్, దూదికట్ల సత్యం, సాధు మహిపాల్ రెడ్డి, లక్ష్మి నర్సింహారావు బోయినిపల్లి సతీష్ రావు, జంగాల మంగపతి రావు, జంగాల నర్సింహారావు, ఓదెల శివకుమార్, నాళ్ళ వీరన్న, అచ్చ శ్రీని
వాస్, మాలె శ్రవణ్, ఇమ్మడి కృష్ణమూర్తి, తోడేటి వెంకన్న, కట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.










