ఆర్ఎస్ఎస్ పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం|

0
3

చిత్తూరు జిల్లా పుంగనూరులోని జేఎండీ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విభాగ్ సద్భావన ప్రముఖ్ మోహన్‌రామిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ జీవనానికి, హిందూ సంస్కృతికి భగవాధ్వజం ప్రతీక అని, దానిని సంఘం గురువుగా భావిస్తుందని తెలిపారు. దేశ వైభవం కోసం సేవాభావం, క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తితో పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఖండ సంఘచాలక్ ముల్లంగి రవీంద్రతో పాటు పలువురు స్వయంసేవకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.