వచ్చే నెల నుండి గ్రామం మధ్యలోనే రేషన్ షాపు నిర్వహించాలి – డీలర్ మేడం గారిని కోరిన బాబాపూర్ సర్పంచ్ సత్రవేణి రాజన్న మరియు గ్రామస్థులు|

0
4

🎤 కుమురం భీం భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్

బాబాపూర్:గతంలో చాలా కాలం పాటు గ్రామం మధ్యలోనే అందరికీ అందుబాటులో నడిచిన చౌక ధరల దుకాణాన్ని (రేషన్ షాపు) గత ఒక సంవత్సరం నుండి ఊరి బయటకు మార్చడం వల్ల స్థానిక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక సంవత్సరం నుండి ఊరి బయట ఉన్న ఈ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా మారిందని బాబాపూర్ గ్రామ మహిళలు స్థానిక సర్పంచ్ సత్రవేణి రాజన్న గారికి ఫిర్యాదు చేశారు.దీనిపై తక్షణమే స్పందించిన సర్పంచ్ సత్రవేణి రాజన్న గారి ఆధ్వర్యంలో గ్రామ మహిళలు, స్థానికులు అంతా కలిసి రేషన్ డీలర్ మేడం గారిని నేరుగా కలిశారు. గతంలో ఎన్నో ఏళ్లుగా గ్రామం మధ్యలోనే రేషన్ షాపు నడిచిందని, ప్రజల సౌకర్యం కోసం వచ్చే నెల నుండి మళ్లీ మునుపటి లాగే గ్రామం మధ్యలోనే దుకాణాన్ని నిర్వహించాలని డీలర్ మేడం గారిని కోరారు.