ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ|

0
3

రామసముద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వైఎస్ఆర్సిపి మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉలపాడు, చొక్కాడ్లపల్లి గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ గణన పత్రాలు పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని, బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.