తాగునీటి కష్టాలకు చెక్.|

0
8

“ఏళ్ల తరబడి ఎదురుచూసిన సమస్యకు పరిష్కారం.. కాలనీ వాసుల్లో హర్షం”

మేడ్చల్ మల్కాజిగిరి : ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆల్వాల్ ల్లోని న్యూ ఎంఈఎస్ కాలనీ వాసులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైప్‌లైన్ పనులు విజయవంతంగా పూర్తికావడంతో కాలనీలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది.

ఈ అభివృద్ధి పనులతో కాలనీలో ప్రాథమిక పౌర సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తమ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కి , అలాగే సంబంధిత అధికారులకు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

#Sidhumaroju

Alwal