వరుణ దేవా కరుణించు వర్షాల కోసం బొడ్రాయికి ప్రత్యేక పూజలు|

0
3

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జులై 10 సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోయ మధు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ మహిళలు రైతులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి వర్షాలు కురిసే చెరువులు కుంటలు నిండాలని సమృద్ధిగా పంటలు పండాలని ప్రార్ధించారు వర్షా బావ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గ్రామస్తులు సామూహికంగా ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు రైతులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు