ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పర్యటన నేపథ్యంలో, ఈరోజు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించడం జరిగింది. లోకేష్ గారి బృందం సభ్యులు, ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించాను. బహిరంగ సభ వేదిక ఏర్పాటు, సభకు వచ్చే ప్రజల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మరియు వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించాను.
మన నియోజకవర్గానికి వస్తున్న మంత్రి గారి పర్యటనకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎక్కడా ఎలాంటి చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించాను. ప్రతి ఏర్పాటును ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతం చేయాలని అధికారులకు మరియు మన పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశాను. మన ఆళ్లగడ్డ ప్రగతికి సరికొత్త ఊపునిచ్చే ఈ పర్యటనను అందరం కలిసి దిగ్విజయం చేద్దాం.










