అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ|

0
2

అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ.

దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని అన్నా క్యాంటీన్ ని సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.

ఈ సందర్బంగా Dr. లక్ష్మీ గారు మాట్లాడుతూ…

అన్నా క్యాంటీన్ ద్వారా నిరు పేదలకు 5/- రూపాయలకే పరిశుభ్రమైన వాతావరణం – ఆరోగ్యకరమైన భోజనం అందించమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని అన్నారు.

అన్న క్యాంటీన్లలో ప్రతిరోజు ఎంతో నాణ్యమైన, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన భోజనాన్ని గౌరవంతో అందించడానికి మా సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

అందుకే, మన కోసం ఏర్పాటు చేసిన ఈ అన్నక్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత.

భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని నేలపై వేయకుండా, సమీపంలో ఉన్న చెత్తబుట్టల్లోనే వేయండి.

అన్న క్యాంటీన్ ఆవరణను క్లీన్‌గా ఉంచడం ద్వారా అందరికీ ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిద్దాం.

మనమందరం కలిసికట్టుగా మన అన్న క్యాంటీన్ ను శుభ్రంగా ఉంచుకుందాం అని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తెలియజేసారు.