Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు 13-07-2026 సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూ 1,25,45,420.00, లు
బంగారు 000-043-950 గ్రాములు,
వెండి 000-550-100 గ్రాములు,
ఫారెన్ కరెన్సీ – 1) Euro 10 – 1 Note, 2) Euro 5 – 1 Note, 3) Central bank of Kuwait (1Dinar) – 1 Note, 4) Thailand 20 – 1 Note, 5) Central bank of Trinidad and Tobago (20 Dollars) 1 Note, 6) Central bank of Trinidad and Tobago (1 Dollars) – 1 Note, అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 22,179/-లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 96,241.00 ఆదాయంగా సమకూరినట్లు ఆలయ ఈఓ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు
హుండీ లెక్కింపునకు అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి శ్రీ J. విశ్వనాధ్ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్, పుంగనూరు వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.










