పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాంబాబు పదోన్నతి పై పుంగనూరు కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రెజరీ సేవలు సత్వరమే అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఎస్టిఓ గా పదోన్నతి పొందిన రాంబాబును అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ డి టి ఎ ఓ లోకేష్ బాబు, ఎస్ టిఓ లు నరేష్ కుమార్ నాయక్ , పద్మనాభం సీనియర్ అకౌంటెంట్ లు సైఫుల్లా , రెడ్డి శేఖర్, శరత్ లు అభినందించారు# కొత్తూరు మురళి.










