నిర్మల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష: ఓటర్ల నమోదుపై నేతల దిశానిర్దేశం|

0
2

నిర్మల్ పట్టణంలోని గాజులపేట్, బుదవార్పేట్, బంగాల్పేట్, బెస్తవార్పేట్, గులజార్ మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్ ప్రాంతాలలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) మరియు పార్టీ బీఎల్‌ఏలతో సమావేశమై ఓటరు నమోదు, పేర్ల చేర్పులు, సవరణలపై చర్చించారు. ప్రతి అర్హులైన ఓటరుకు న్యాయం జరగాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని వారు ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి పేరు ఉండేలా పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.