పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళతాడు . వాడికి కావలసిన పనులన్నీ చేయించుకుంటాడు . లోన్లు తీసుకుంటాడు …. ఇళ్ళ స్థలాలు తీసుకుంటాడు … పోలీస్ స్టేషన్ కి వెళితే అయిదు నిముషాల్లో బయటికి వస్తాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లడం … ప్రభుత్వ పథకాలు అన్ని తీసుకోవడం …. ఇదే పని . ఈరోజులలో వాడికే విలువ ఎక్కువ . అలాంటి వాడే బాగా బతుకుతున్నాడు ఈ సమాజంలో . మరి ఒకే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే … వాడి బతుకు వాడే బతకాలి … కష్టపడి పనిచేసుకోవాలి … రూపాయి రూపాయి దాచుకోవాలి . వాళ్ళని ఎవరూ పట్టించుకోరు కారణం … పార్టీని విడిచి పోడు అన్న నమ్మకం . పార్టీకి మూలస్తంభాలు లాంటి వాళ్లు కార్యకర్తలు . కార్యకర్తలను మోసం చేసిన నాయకులున్నారు గానీ నాయకుల్ని మోసం చేసిన కార్యకర్తలు లేరు .










