ఆసిఫాబాద్ విద్యాశాఖలో నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల భర్తీ|

0
74

🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జిల్లా విద్యాశాఖలో ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయకుండానే, ఒక ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాలు జరుపుతున్నారని విద్యార్థి నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ అక్రమ నియామకాలపై విద్యార్థి నిరుద్యోగ జేఏసీ (JAC) ఆధ్వర్యంలో సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ పాన్న రమేష్ మాట్లాడుతూ. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఇలాంటి అక్రమ మార్గంలో నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. గ్రూప్-4 మరియు వైద్య విధాన పరిషత్ ఉద్యోగాల తరహాలోనే, ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను కూడా పూర్తిగా మెరిట్ ఆధారంగా, అత్యంత పారదర్శకంగా భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.