పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు.|

0
14

● ప్రతిభావంతులకు తెలంగాణ పోలీసుల ఆహ్వానం

● అక్టోబర్ 31 వరకు ఎంట్రీల స్వీకరణ

అల్వాల్, అక్టోబర్ 26: పోలీస్ ఫ్లాగ్ డే–2026 సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తోంది. 

పోలీసుల అంకితభావం, విధినిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రతిబింబించేలా సృజనాత్మక ప్రతిభ కలిగినవారు ఈ పోటీల్లో పాల్గొనాలని శాఖ ఆహ్వానించింది.

పోలీసు విధులకు సంబంధించిన అంశాలపై ఇంగ్లీష్, తెలుగు లేదా ఉర్దూ భాషల్లో షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించవచ్చు. పోలీసుల సేవలను ప్రతిబింబించే ఫొటోగ్రఫీకి కూడా అవకాశం కల్పించారు. 

విజేతలకు రాష్ట్రస్థాయి మెరిట్ సర్టిఫికెట్లు, పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

ఆసక్తి గలవారు తమ ఎంట్రీలను అక్టోబర్ 31, 2026లోగా కింది లింక్ ద్వారా సమర్పించాలి.

పోటీల ఎంట్రీ ఫారమ్: https://forms.gle/DyLXdWUmgZEspxDv8

#Sidhumaroju 

Alwal