రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.|

0
2

విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 18 పతకాలు సాధించారు. ఈ విజయం అకాడమీకి, పుంగనూరుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిల్టన్ శాస్త్రి నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌కు టీమ్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ మంగళవారం కొండూరు ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. ఎన్. చరణ్, జి. బి. మోహిత్, ఎన్. కృతిక్ బంగారు పతకాలు సాధించారు. కరాటేలో పుంగనూరుకు పేరు తెస్తున్న మాస్టర్ సదాశివను పలువురు అభినందించారు# కొత్తూరు మురళి .