Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.

0
0

 Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 4:50 గంటల సమయంలో హోటల్‌లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇన్‌చార్జ్ అగ్నిమాపక కేంద్రాధికారి జె. బాబయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగతో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని హోటల్ యజమాని ఎస్‌పి పృథ్వీరాజ్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.