🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO)గా డాక్టర్ సిడాం నాగేంద్ర నియమితులయ్యారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ సీతారాం స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఉషేగాం పీహెచ్సీ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగేంద్ర.. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.










