ఇంద్రమ్మ ఇళ్ల ఇసుకపైనా మాఫియా కన్ను.. ప్రభుత్వ చర్యలేవి?|

0
1

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో డబుల్ బెడ్రూమ్ (2BHK) ఇళ్ల నిర్మాణ సమయంలో రోజుకు వందల లారీల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్లకు సైతం అదే తరహాలో ఇసుక మాఫియా పంజా విసురుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం సీసీ కెమెరాలు, ట్రాకింగ్ వంటి చర్యలు ప్రకటించినప్పటికీ, పాత అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. రోజుకు ఎన్ని లారీలు నడుస్తున్నాయి? ఎంత ఇసుక వాస్తవంగా నిర్మాణాలకు చేరుతోంది? అన్న విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, పేదల ఇసుక మాఫియా పాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.