🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ కె. హరిత, డీసీసీబీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఆదివాసీ నాయకులతో కలిసి నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని గిరిజన ప్రజలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. ‘జల్-జంగల్-జమీన్’ (నీరు-అడవి-భూమి) హక్కుల కోసం, గిరిజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన ఆదివాసీ వీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, ప్రజలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










