ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) మైదానంలో నిర్వహించిన “పేదలకు పట్టాభిషేకం – మీ ఇల్లు మీ హక్కు” రిజిస్టర్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమానికి అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయిన 60వ వార్డుకు చెందిన సుమారు 180 మంది లబ్ధిదారులకు ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో నేడు విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు శాశ్వత ఆస్తి పత్రాలను (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్) స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడూ నష్టపోకూడదనే ఉద్దేశంతోనే స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఈ పంపిణీ ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో ఇచ్చిన పట్టాలను , సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ అధికారిక ముద్రతో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్టర్డ్ పత్రాలు ఇచ్చామని, వీటి ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొంది పిల్లల ఉన్నత చదువులకు, కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఈ శాశ్వత ఆస్తి పత్రాలు లబ్ధిదారుల తరతరాలకు బలమైన ఆర్థిక రక్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములగాడ తహసీల్దార్ రామలక్ష్మి, జనసేన ఇంచార్జి అంగ ప్రశాంతి, రెవెన్యూ అధికారులు, స్థానిక కూటమి నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు
Home Andhra Pradesh ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో 60వ వార్డు లబ్ధిదారులకు ఆస్తి పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ గణబాబు










