తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితాల సమగ్ర సవరణ (SIR-2026) కొరకు చేపట్టిన ఇళ్ల సర్వే ఫారాల సమర్పణకు నేడే ఆఖరు గడువు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.38 కోట్లకు పైగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసిన అధికారులు, వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 78.14% డిజిటైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నేటితో సర్వే గడువు ముగియనుండగా, ఆగస్టు 17న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలు, సవరణలకు అవకాశం ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే వేగంగా సాగినా, హైదరాబాద్ వంటి నగరాల్లో నమోదు శాతం తక్కువగా నమోదైంది. ఓటు హక్కును కాపాడుకోవడానికి అర్హులైన పౌరులు తమ వివరాలను వెంటనే బిఎల్ఓలకు అందించాలి లేదా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. అభ్యంతరాల పరిశీలన ముగిసాక, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు










