కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆసిఫాబాద్ టు ఎర్రవల్లి పాదయాత్ర|

0
4

🎤కుమురం భీం ఆసిఫాబాద్ న్యూస్ ప్రతినిధి జగదీష్:

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గారు మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలం నుండి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు బీఆర్ఎస్ పార్టీ వీర అభిమానులు జాడి తిరుపతి గారు, దుర్గం శంకర్ గారు ప్రతిష్టాత్మక మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి గారు గులాబీ జెండా ఊపి పాదయాత్రను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సింగిల్ విండో చైర్మన్ అలీ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్ గారు, కౌన్సిలర్ సలాం గారు, వాంకిడి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ అజయ్ గారు, వాంకిడి సర్పంచ్ సతీష్ గారు, మాజీ సర్పంచ్ తుకారాం గారు, రాజంపేట సర్పంచ్ భుర్స పోచయ్య గారు, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి గారు, యూత్ అధ్యక్షులు రాకేష్ గారు, అశుతోష్ గారు, శైలేష్ గారు, శ్రీను గారు మరియు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.