అల్వాల్, సెప్టెంబర్ 25: గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని షామీర్పేట్ చెరువు వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టిన చర్యలను మల్కాజ్గిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి తో కలిసి సమీక్షించారు.
చెరువు వద్ద నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్, సీసీ కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.
నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని, రద్దీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
చెరువు పరిసరాల్లో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా చూడాలని తెలిపారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసు సిబ్బంది, మున్సిపల్ అధికారులు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీపీ సుమతి సూచించారు.
భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
#Sidhumaroju
Alwal









