గణపతి నిమజ్జనం సందర్భంగా ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు

0
1

మంచిర్యాల: గణపతి నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయం, లక్ష్మీనారాయణ ఆలయాల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భక్తులు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వినాయకుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యేను స్థానిక కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.