జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా కుంటాల శంకర్ నియామకం

0
2

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కుంటాల శంకర్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సురేఖమ్మ శంకర్‌కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవి కల్పించినందుకు వారికి శంకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.