మదనపల్లెలో భారీ అగ్నిప్రమాదం: రూ.10 లక్షల ఆస్తి నష్టం|

0
1

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చౌడేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో నిర్వహిస్తున్న గుజరి దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

 

నీరుగట్టువారిపల్లికి చెందిన చల్లా శివ గత కొన్నేళ్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో దుకాణంలో నిల్వ ఉంచిన అట్టలు, పేపర్, అల్యూమినియం, కాపర్, ఇనుము తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.

 

సమాచారం అందుకున్న మదనపల్లె అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ఘటనపై అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు