మదనపల్లె: నీరుగట్టువారిపల్లి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా హంద్రీనీవా కాలువను పరిశీలించి, కాలువ ద్వారా వచ్చే నీటిని అమ్మచెరువుకు మళ్లించే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మరో రెండు, మూడు నెలల పాటు హంద్రీనీవా కాలువలో నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ నీటిని అమ్మచెరువులోకి మళ్లించి, మదనపల్లె 34, 35వ వార్డు, కోళ్లబైలు గ్రామపంచాయతీ1,2 పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేతో పాటు కోళ్లబైలు ఇన్‌చార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు, 34 వార్డ్ ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇన్‌చార్జ్ స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.










