రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీ దోపిడీ.|

0
0

మదనపల్లె శివార్లలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉన్న ఒక రిటైర్డ్ రూరల్ వాటర్ సప్లై (RWS) డివిజనల్ ఇంజనీర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని వారు నిద్రిస్తున్న సమయంలో కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, అల్మారా పగలగొట్టి 670 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు మరియు రూ. 25,000 నగదు దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.