పోలీసుల విధులకు ఆటంకం.. ఇద్దరి అరెస్ట్.|

0
5

● పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరి అరెస్ట్

● దురుసు ప్రవర్తనతో పాటు అసభ్య పదజాలంతో న్యూసెన్స్

● కోర్టులో హాజరు.. న్యాయ రిమాండ్‌కు తరలింపు

మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 17: బోనాల ఉత్సవాల సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించిన ఇద్దరిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయ రిమాండ్‌కు తరలించారు.

మల్కాజిగిరి పరిధిలోని ఎంజీ నగర్ భూలక్ష్మమ్మ ఆలయం వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు బోనాల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో మీశాల సంతోష్ (20), జరిఫోతుల దీపక్ (28) అక్కడ న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్‌ఐ దేవేందర్, పీసీ గోపాల్ (1408), టీజీఎస్‌పీ సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని, పోలీసుల విధులకు సహకరించాలని సూచించారు.

అయితే వారు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు న్యాయ రిమాండ్ విధించింది.

#sidhumaroju

Alwal