మణప్పురం గోల్డ్ లోన్ నూతన శాఖ ప్రారంభం.|

0
9

● ఫాదర్ బాలయ్యనగర్‌లో నూతన శాఖ ప్రారంభం

● ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి

● ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచన

మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లో మణప్పురం గోల్డ్ లోన్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరై తన చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి నూతన శాఖను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన శాఖ ఏర్పాటు ద్వారా ఫాదర్ బాలయ్యనగర్, పరిసర ప్రాంతాల ప్రజలకు గోల్డ్ లోన్ సేవలు మరింత చేరువ కానున్నాయని అన్నారు. ఖాతాదారులకు నమ్మకమైన, పారదర్శకమైన సేవలు అందిస్తూ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్నేహపూర్వక వాతావరణంలో సేవలు అందించాలని ఆకాంక్షించారు.

నూతన శాఖ ద్వారా స్థానిక ప్రజలకు తమ అవసరాలకు అనుగుణంగా బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం అందుబాటులోకి రానుంది.

ఖాతాదారులకు సంస్థ నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో బిజినెస్ హెడ్ జోషి వి.కె., ఫీల్డ్ జోనల్ మేనేజర్లు చక్రధర్ టి., మోహన్ రెడ్డి, రీజినల్ మేనేజర్ రోహిత్ పర్సోడియా, ఏరియా హెడ్ అవునూరి జగన్, బ్రాంచ్ హెడ్ మహేందర్, అసిస్టెంట్ బ్రాంచ్ హెడ్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన శాఖ సిబ్బందిని అభినందించిన ఆమె, ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మెరుగైన సేవలతో శాఖను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గోల్డ్ లోన్ పథకాల్లో భాగంగా రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు 87 పైసలు, రూ.5 లక్షలు ఆపై రుణాలకు 79 పైసల వడ్డీ రేటు పథకాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

#Sidhumaroju

Alwal