పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి అండ…!

0
3

 

నందిగామలో 32 మందికి రూ.16 లక్షల చెక్కుల పంపిణీ

నందిగామ అక్టోబర్ 3 bharat aawaz : అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం 32 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ పరిశీలకుడు తాళ్ల వెంకటేష్ యాదవ్, కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.