PAIDE Convention యజమాని, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సోదరుడు శ్రీ పైడి రాజ రెడ్డి గారి ఆహ్వానం మేరకు గణేష్ బిగాల గారు కన్వెన్షన్‌ను సందర్శించారు.నిజామాబాద్ నగరంలో దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన PAIDE Convention అత్యంత విశాలంగా, ఆధునిక సౌకర్యాలతో అద్భుతంగా ఉందని గణేష్ బిగాల గారు ప్రశంసించారు.
నిజామాబాద్ నగరానికి ఇలాంటి అత్యాధునిక కన్వెన్షన్ హాల్ రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా PAIDE Convention యాజమాన్యానికి, ముఖ్యంగా పైడి రాజ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.










