మహబూబాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కాలేజీలో షీ టీం, సైబర్ క్రైమ్, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీం విధులు, పోక్సో చట్టం, టీ-సేఫ్ యాప్ వినియోగం గురించి ఎస్ఐ సునంద వివరించారు. ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఎస్ఐ కరుణాకర్ సూచించారు. బాధితులకు భరోసా కేంద్రం అందించే సేవలు, మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో 112, 1930, 1098, 181 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.










