శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు |

0
0

చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాస స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులతో కలిసి తిలకించారు.

శ్రీనివాస స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి మండిపల్లి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మంత్రి దంపతులకు ఆలయ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

కల్యాణ మహోత్సవం అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభించారు. అనంతరం తన చేతులతో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ప్రజలందరి ఇళ్లలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, శ్రీనివాస స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.