ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా చేయూత పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.
ఈ నెల 31వ తేదీతో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు ముగియనుంది. ఈ తరుణంలో జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు కూడా సమాచారం అందించి, వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువు లోపల తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె కోరారు.










