ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులు జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
సిబ్బంది సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత, పోలీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వామనమూర్తి మరియు ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులతో ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు మరియు కింది స్థాయి సిబ్బంది క్షేమ సమాచారాలు, వారి సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తిగత.
వృత్తిపరమైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.శాఖలో ఐక్యత ముఖ్యం పోలీస్ శాఖలో అంతర్గత సమన్వయం మరియు ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది పాత్ర కీలకమని, అందరూ కలిసికట్టుగా విధులు నిర్వహించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










