మూత్రశాల కంటే దారుణంగా వెలగండ్ల సచివాలయం… అధికారులకు కనపడటం లేదా?

0
1

కొండాపురం (నెల్లూరు జిల్లా):

మండల పరిధిలోని వెలగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సచివాలయ భవనం పిచ్చి మొక్కలతో, మురికిగా మారి దారుణమైన స్థితిలో దర్శనమిస్తోంది.

వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే గ్రామస్థులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, సచివాలయానికి మరమ్మతులు చేపట్టి, శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.