రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దంపతులు మృతి…!

0
2

 

 

వరంగల్: యాక్సిడెంట్.. సర్పంచ్ దంపతుల మృతి

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో ఈ నెల 16న ఇటుకాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. నల్లబెల్లి మండలం లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి ఈ నెల 17న మృతి చెందారు. ఆమె భర్త కస్తూరి రవీందర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఒకే ప్రమాదంలో భార్యా భర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రామ్