🇮🇳 49వ జయంతి సందర్భంగా కెప్టెన్ రాపోలు వీర రాజా రెడ్డికి ఘన నివాళులు
హైదరాబాద్: హబ్సిగూడలో కెప్టెన్ రాపోలు వీర రాజా రెడ్డి 49వ జయంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధైర్యసాహసాలు, దేశ సేవ, అంకితభావం మరియు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్థానికులు నివాళులు అర్పించారు.
హబ్సిగూడలోని కెప్టెన్ వీర రాజా రెడ్డి విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పాల్గొని కెప్టెన్ వీర రాజా రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేశం కోసం సేవలందించిన వీర సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని హబ్సిగూడ నివాసులు నిర్వహించగా, S.S.S యువసేన సహకారం అందించింది.
🇮🇳 దేశం కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం 🇮🇳
భారత్ ఆవాజ్
జై హింద్ 🇮🇳










