దుగ్గొండి నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు…

0
6

భారత ఆవాజ్ న్యూస్: దుగ్గొండి, సెప్టెంబర్    దుగ్గొండి మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు నూతన సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, శాంతిభద్రతల విషయంలో ప్రజాప్రతినిధులుగా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్ ఉపాధ్యక్షులు కోటగిరి భాస్కర్ ప్రధాన కార్యదర్శి గోగుల్ల శ్రీనివాసరెడ్డి కార్యదర్శి సుఖినే నాగరాజు అధికార ప్రతినిధి జంగిలి రాజు కోశాధికారి కోలుగూరి సుజాత సభ్యులు రాస రమ చేరాలు అజ్మీరా రజిత తిరుపతి బూర రాధిక హేమచంద్ బుర్రి రాంబాబు పెండ్లి వెంకటేశ్వర్లు కన్నం అలీమా చిరంజీవి ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు అజ్మీర నిర్మలా వంశీ భాదరగోని రమేష్ డైరెక్టర్ థౌజయ నాయక్ తదితరులు పాల్గొన్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..