Madanapalle: అన్నమయ్య జిల్లా డీఈఓ లాగిన్‌లో డేటా మార్పులు, రూ.1.40 కోట్ల గుడ్లు, చిక్కీల బిల్లుల అవకతవకలపై విచారణ జరపాలని APSJAC, USFI డిమాండ్ చేశాయి.

0
1

అన్నమయ్య జిల్లా: మదనపల్లి, అన్నమయ్య జిల్లా నేడు పాఠశాల రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు నియమించిన కమిటీ సభ్యులకు వినతీపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వి. ఉత్తన్న, USFI రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహ మాట్లాడుతూ జిల్లా అధికారి మీద విచారణ చేయు సందర్భంలో ఆ పై స్థాయి అధికారులచే విచారణ జరిపించాలని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేయాలని అన్నారు. రికార్డులను కూడా తారు మారు చేస్తారానే అనుమానం ఉంది అన్నారు.