భారీ వర్షాలకు స్తంభించిన ఆంధ్ర, ఒడిస్సా రాకపోకలు: చింతూరు డివిజన్

0
1

గత మూడు రోజుల నుంచి ఆర్నాబ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు చింతూరు డివిజన్ అతలాకుతలమవుతుంది. మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రా నుంచి ఒడిస్సా కి వెళ్తున్న జాతీయ రహదారి 30 కుయిగూరు వద్ద వాగు పై ఉన్న బ్రిడ్జిని వరద ముంచేత్తడంతో ఆంధ్ర నుండి ఒడిస్సా వైపు వెళ్తున్న భారీ వాహనాలు ఆటోలు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చింతూరు డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు విఆర్ పురం వెళ్తున్న రహదారిలో ఉన్నటువంటి సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి, వరదలను అధికారులు ఎక్కడకక్కడ సమీక్షిస్తూ ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచనలు ఇస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని తెలిపారు.

 

# Yadagiri