మదనపల్లె: రాయలసీమ దశ దిశ మార్చే హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. మదనపల్లెలో అక్టోబర్ 2వ తేదీన కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభిచనున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వివిధ రూపాల్లో ఇవ్వనుంది. వీటికి తోడు మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రానున్నాయి.










