Madanapalle: అన్నమయ్య: మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులు జయచంద్రారెడ్డి గిరిధర్‌రెడ్డిల ముగిసిన మూడు రోజుల కస్టడీ వైద్య పరీక్షల అనంతరం కడప జైలుకు తరలింపు.

0
3

Madanapalle: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో ఏ-17 నిందితుడు జయచంద్రారెడ్డి, ఏ-18 నిందితుడు గిరిధర్‌రెడ్డిల మూడు రోజుల కస్టడీ ముగిసింది. ఈ విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర తెలిపారు. గురువారం కస్టడీ అనంతరం ఇద్దరు నిందితులను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.