వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇలక్కియ పరిశీలన
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 24:భారత్ అవాజ్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పంటలకు నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ ఆదేశించారు. గురువారం వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో పర్యటించిన ఆమె పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని తెలుసుకున్నారు.వర్షాల ప్రభావంతో పొలాల్లో నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి నీటి పారుదలకు అవసరమైన చర్యలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పంటలకు నష్టం జరిగితే క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
అనంతరం లింగాల వంతెనను పరిశీలించిన జేసీ.. భారీ వర్షాల నేపథ్యంలో వంతెనలు, వాగులు, వంకల వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల భద్రతకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జగ్గయ్యపేట పట్టణంలోని ఊర చెరువును పరిశీలించి నీటి నిల్వ, ప్రవాహం, పరిసర ప్రాంతాల పరిస్థితిని తెలుసుకున్నారు.ఈ పర్యటనలో నందిగామ ఆర్డీవో జి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










