వేలంక గ్రామం లో యసి కాలని జలమయం, స్పందించిన స్థానిక టిడిపి యువ నాయకులు : గండే కాశి మరియు అధికారులు.

0
2

కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం,వేలంక గ్రామం లో గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు కాలువలు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి అధికారులు సకాలంలో కాలువలో పూడిక తీయించుకుపోవడం వల్ల స్థానిక ఎస్సీ కాలనీ లో దండోరా స్తూపం వద్ద గృహాల ముంపు కి గురవుతున్న వైనం, రోడ్లు మీదకు విస్తృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని కాలువలు శుభ్రం చేయించవలసిందిగా పలువురు కోరుతున్నారు 

                       ఈ ముంపుకు గురైన ప్రదేశాన్ని స్థానిక నాయకులు గండే కాశి మరియు గ్రామ యువ నాయకులు సందర్శించి వరద ముంపుకు గురయ్యే అవకాశాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లడం అనంతరం జెసిబి ద్వారా కాలువల్లో కొంతమేరకు పూడిక తీయడం జరిగింది, అయినప్పటికీ వరద ఆగకపోవడంతో ఇంకా గ్రామం నందులి ఎస్సీ కాలనీలో గృహాల్లోకి నీరు ప్రవేశించడం జరుగుతూ ఉంది. కొన్నిచోట్ల గృహాలు గోడలు కూలిపోవడం జరిగింది నష్టపరిహారం ఇప్పించవలసిందిగా పలువురు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఆర్వో పండు, గ్రామ సెక్రెటరీ మరియు పంచాయతీ గుమస్తా శ్రీనువాస్, బేతాళ బ్రదర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది.