నందిగామ మండలంలో 2,026 పెన్షన్ దరఖాస్తులకు ఆమోదం

0
3

నందిగామ మండలంలో 2,026 పెన్షన్ దరఖాస్తులకు ఆమోదం

 

నందిగామ: నందిగామ మండలంలోని 23 గ్రామపంచాయతీల పరిధిలో పెన్షన్ల కోసం మొత్తం 2,157 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు ఎంపీడీవో ఆర్. ప్రసాదరావు శుక్రవారం తెలిపారు.

వీటిలో 2,026 దరఖాస్తులకు ఆమోదం లభించిందని, వివిధ అభ్యంతరాల కారణంగా 131 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని ఎంపీడీవో వెల్లడించారు. పెన్షన్ ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.